: సినీ నటుడు సాయికుమార్ ను అసెంబ్లీ ఎన్నికల్లో దించనున్న గాలి జనార్దన్ రెడ్డి!
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో మరోసారి క్రియాశీలక పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి ఆయన చిక్కబళ్లాపూర్ జిల్లా నుంచి బరిలోకి దిగనున్నారు. అంతేకాదు, చిక్కబళ్లాపూర్ జిల్లాలోని గౌరిబిదనూరు నియోజకవర్గం నుంచి తన భార్యను బరిలోకి దించాలనే యోచనలో ఉన్నారు. దీనికి తోడు, బాగేపల్లి నియోజకవర్గం నుంచి తనకు అత్యంత ఆప్తుడైన నటుడు సాయికుమార్ ను బరిలోకి దింపనున్నారు. బాగేపల్లి నుంచి ఇప్పటికే ఒకసారి పోటీ చేసిన సాయికుమార్ ఓటమిపాలయ్యారు.