: ముగింపుకు చేరుకున్న ఐపీఎల్... ఈ నాలుగు జట్ల నుంచే విజేత!


ఈ సీజన్ ఐపీఎల్ ముగింపుకు చేరుకుంటోంది. ఒక అంచె పోటీలు ముగిశాయి. క్వాలిఫయర్ దశలో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు మలిదశ పోటీలకు అర్హత సాధించాయి.

అయితే ఈ పోటీల్లో ముంబై ఇండియన్స్ తో పాటు రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందులో విజేత నేరుగా ఫైనల్ మ్యాచ్ కు అర్హత సాధిస్తుంది. ఓటమిపాలైన జట్టు సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్యపోరులో విజయం సాధించిన జట్టుతో ఆడుతుంది. అనంతరం ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన జట్టు, తొలి మ్యాచ్ లో పరాజిత, రెండో మ్యాచ్ విజేత జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఓటమిపాలైన జట్టుతో మూడో స్థానం కోసం ఆడుతుంది. అనంతరం చివరగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆదివారంతో 2017 ఐపీఎల్ సీజన్ ముగిసిపోనుంది. 

  • Loading...

More Telugu News