: సంచలన నిర్ణయం తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి.. చిక్కబళ్లాపూర్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్!
బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బళ్లారి నుంచి కాకుండా చిక్కబళ్లాపూర్ నుంచి పాలిటిక్స్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన కార్యాచరణ ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం. చిక్కబళ్లాపూర్ కూడా ఏపీకి సరిహద్దులోనే ఉండటం... ఆ ప్రాంతంలో కూడా రెడ్డి కులస్తులు ఎక్కువగా ఉండటంతో... ఆ నియోజకర్గంపై గాలి దృష్టి సారించారు. ఈ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఐదుమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా కంచుకోటగా ఉన్నప్పటికీ... నేతలందరినీ తనవైపు తిప్పుకునేందుకు గాలి ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.