: అజిత్ సత్తా: 'వివేగం' టీజర్ ధాటికి కోలీవుడ్ రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి!


ప్రముఖ కోలీవుడ్ నటుడు అజిత్ తాజా సినిమా 'వివేగం' టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. దీని ధాటికి కోలీవుడ్ టీజర్ రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఈ టీజర్ కు ఫిదా అయిపోతున్నారు. కోలీవుడ్ నటీనటులంతా టీజర్ పై పాజిటివ్ గా స్పందించడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచుతోంది. ఆ క్రమంలో తలైవా రికార్డులను ఇది తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో 11వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 12 గంటల వ్యవధిలోనే ‘కబాలి’ టీజర్‌ వీక్షణుల రికార్డును అధిగమించింది. తాజాగా ‘కబాలి’ టీజర్‌ కు సంబంధించిన మరో రికార్డునూ బద్దలుకొట్టింది.

కబాలి టీజర్‌ విడుదలైన 72 గంటల్లో కోటి మంది వీక్షించగా ఆ రికార్డును ‘వివేగం’ కేవలం 68 గంటల్లోనే తిరగరాసింది. అంతే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో అజిత్‌ సినిమా టీజర్‌ కు కోటి వీక్షణలు రావడం కూడా ఇదే తొలిసారి. టీజర్ ను చూసిన వారంతా హాలీవుడ్‌ స్థాయిలో అద్భుతంగా అజిత్‌ లుక్‌, స్టైల్‌, డైలాగులు, నేపథ్య సంగీతం, ఎడిటింగ్‌ వంటివన్నీ అదిరిపోయాయని అంటున్నారు. ఈ టీజర్ ను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News