: వచ్చి పడిన రాళ్లు, పగిలిన తలలు... ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత


హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ను కొనసాగించాలని సీపీఐ, సీపీఎం నిరసనకారులు ఓపక్క... అక్కడ ఉంచవద్దని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరోపక్క ఆందోళనలకు దిగిన వేళ, ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శాంతియుతంగా ఇరు వర్గాలకూ తమ నిరసనను తెలుపుకునేందుకు పోలీసులు అనుమతించగా, ఒకే సమయంలో ధర్నా చౌక్ వద్దకు చేరిన ఇరు వర్గాలు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.

జండా కర్రలతో తమపై దాడులు చేశారని స్థానికులు, బయటి నుంచి గూండాలను తెప్పించి తమపై రాళ్లను రువ్వారని వామపక్షాలవారు పరస్పరం ఆరోపించుకున్నారు. వారి మధ్య వాగ్వాదం, తోపులాటలతో మొదలైన గొడవ, ఆపై రాళ్లు రువ్వుకునే వరకూ వెళ్లింది. ఎవరినీ అరెస్టులు చేయవద్దని ముందే పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందగా, అక్కడ మోహరించిన పోలీసులు ఈ దాడులను చూసీ చూడనట్టు వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఇరు వర్గాలనూ వేరు చేసి బందోబస్తును పెంచామని పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

  • Loading...

More Telugu News