: కరణ్ జొహార్ పై కేసు వేయనున్న సొంత కుటుంబీకులు!
బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ పై అతని కుటుంబ సభ్యులు దావా వేయనున్నారు. తన ఆటోబయోగ్రఫీ ‘యాన్ అన్ సూటబుల్ బాయ్’ పేరుతో కరణ్ ఇటీవల ఓ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఆ పుసక్తంలో తనతో పాటు, తన తండ్రి గురించి కూడా గొప్పగా రాసుకున్న కరణ్... ఇతర కుటుంబ సభ్యులను కించపరిచేలా ప్రస్తావించాడని మండిపడుతున్నారు. వాస్తవానికి కరణ్ కుటుంబం ఉమ్మడి కుటుంబం. వారంతా స్వీట్ల వ్యాపారం చేసేవారు. అయితే కరణ్ జొహార్ తండ్రి యశ్ జొహార్ ఒక్కడే వారి కుటుంబంలో చదువుకున్నవాడు కావడంతో, షాపులోని బిల్లింగ్ సెక్షన్ లో ఆయన పని చేసేవాడు.
అనంతరం స్వీట్ల వ్యాపారం మానేసి, సినీ నిర్మాతగా కెరీర్ ప్రారంభించి విజయవంతమయ్యారు. ఈ నేపథ్యంలో కరణ్ తన గురించి రాసిన భాగంలో పేదింటి కుర్రాడి నుంచి సంపన్నుడిగా ఎలా ఎదిగాడో అన్నీ ప్రస్తావించాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి గొప్పగా రాసుకుని మిగతా కుటుంబీకుల గురించి చీప్ గా ప్రస్తావించాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరణ్ పై కేసు వేయడానికి వారంతా సమాయత్తమవుతున్నారు.