: చైనాకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్తత


ఓ వైపు వన్ బెల్ట్ వన్ రోడ్ అంశంపై చైనా రాజధాని బీజింగ్ లో భారీ సదస్సు జరుగుతోంది. ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో చైనాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన జరుగుతోంది. వన్ బెల్ట్ వన్ రోడ్డు అంశానికి తాము పూర్తిగా వ్యతిరేకమంటూ పీవోకేలోని ప్రజలు ఆందోళన బాటపట్టారు. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు పేరిట తమ ప్రాంతంలో చేపట్టిన భారీ నిర్మాణానికి తాము వ్యతిరేకమంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పారు.

రైల్వే, రోడ్డు, వైమానిక రవాణా మార్గాలను అనుసంధానం చేసేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా భారీ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గిల్గిత్-బాల్టిస్థాన్ లో చైనాకు చెందిన సైనిక శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆలోచనను చైనా ఆపేయాలని పీవోకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తమను మరింత బానిసలుగా మార్చే ప్రయత్నం చేయవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News