: పెళ్లికి నిరాకరించిన యువతి.. ఆమె కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపిన బాలుడు


పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువతిని ఆమె కుటుంబ సభ్యుల కళ్ల ముందే దారుణంగా కాల్చిచంపాడో బాలుడు. ఢిల్లీలో జరిగిందీ ఘోరం. ఆమెను కాల్చి చంపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శుక్రవారం దక్షిణ ఢిల్లీలోని ఖిర్కి ఎక్స్‌టెన్షన్‌లో జరిగిన ఈ కాల్పుల్లో యువతి (24) అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల సమయంలో యువతి సోదరుడు అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన బాలుడి వెంట మరో ఇద్దరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బాలురు కావడంతో వారిని బాల నేరస్తుల గృహానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News