: విండోస్ అప్‌డేట్ వచ్చే వరకు ఏటీఎంలు తెరవొద్దు.. బ్యాంకులను ఆదేశించిన ఆర్‌బీఐ
వాన్నా క్రై వైరస్ నేపథ్యంలో విండోస్ అప్‌డేట్ వచ్చే వరకు ఏటీఎంలను తెరవొద్దని భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై సోమవారం రెండోసారి కూడా హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నట్టు వార్తలు రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మన దేశంలో దాదాపు 90 శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం మీదే ఆధారపడుతున్నారు. దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్ సిస్టంతోనే పనిచేస్తున్నాయి. కాబట్టి విండోస్ అప్‌డేట్ వెర్షన్ వచ్చే వరకు ఏటీఎంలను తెరవవద్దని రిజర్వు బ్యాంకు సూచించింది. వాన్నా క్రై ఏటీఎంల నుంచి ప్రజల సొమ్మును దొంగిలించదని, అందులో ఉన్న సమాచారాన్ని లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేయడమే దాని లక్ష్యమని బ్యాంకు అధికారి ఒకరు పేర్కొన్నారు.