: 5 లక్షల డాలర్లు పెరిగిన చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. ఈసారి విజేతకు రూ.14 కోట్లు


ఈసారి చాంపియన్స్ ట్రోఫీ విజేతలు రూ.14 కోట్ల వరకు నగదు బహుమతిని అందుకోనున్నారు. గతంతో పోల్చుకుంటే ఐసీసీ ఈసారి ప్రైజ్ మనీని రూ.5 లక్షల డాలర్లు పెంచింది. ట్రోఫీలో పాల్గొన్న జట్లకు మొత్తం 4.5 మిలియన్ డాలర్లు పంచనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు లభించనుండగా, రన్నరప్‌కు 1.1 మిలియన్ డాలర్లు, సెమీఫైనల్స్‌లో పరాజయం పాలైన జట్టుకు 4.5 లక్షల డాలర్లు దక్కనున్నాయి. అలాగే గ్రూప్‌లో మూడోస్థానంలో నిలిచే జట్లకు 90 వేల డాలర్లు, చివరి స్థానంలో నిలిచిన జట్లకు 60 వేల డాలర్లను ఐసీసీ చెల్లించనుంది.

  • Loading...

More Telugu News