: స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేయనున్న ఫ్లిప్‌కార్ట్.. ఉద్యోగులకు బంపర్ బొనాంజా!


ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయనున్న వేళ స్నాప్‌డీల్ ఉద్యోగులు భారీ బొనాంజా అందుకోనున్నారు. స్నాప్‌డీల్ తన ఉద్యోగులకు ఏకంగా రూ.193 కోట్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం పూర్తయితే దాదాపు 30 మిలియన్ డాలర్లను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించాలని స్నాప్‌డీల్ వ్యవస్థాపకులు నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు, గత ఏడాదికాలంగా  సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోయిన కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా చెల్లించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం స్నాప్‌డీల్‌లో 2 వేల మంది వరకు పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News