: లారెన్స్ అమ్మకు ఆలయం... ప్రారంభమైన పూజలు


ప్రముఖ కొరియో గ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తన తల్లి కన్మణికి కట్టించిన గుడిని ఈ రోజు ఉదయం ప్రారంభించారు. చెన్నై సమీపంలోని తిరుముల్లైవాయిల్ లో ఇంతకుముందే శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయాన్ని లారెన్స్ నిర్మించాడు. ఈ ఆలయం పక్కనే తన తల్లికి గుడి కట్టించాడు. ఇదే గుడిలో గాయత్రిదేవి విగ్రహాన్ని, శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు.  

  • Loading...

More Telugu News