: వైఎస్సార్సీపీలోకి కేంద్ర మాజీ మంత్రి?
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పనబాక లక్ష్మి దంపతులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారనే ప్రచారం నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా పనబాక లక్ష్మి కొనసాగుతున్నారు. కాగా, ఈ వదంతుల విషయమై పనబాక లక్ష్మి దంపతులు కానీ, వైఎస్సార్సీపీ నాయకులు గానీ స్పందించలేదు.