: లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు హతం


జమ్మూకాశ్మీర్ లోని హంద్వారా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హంద్వారాలోని వారిపొరలో ఉగ్రవాదులు తలదాచుకున్న సమాచారం మేరకు భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. దీంతో, ఉగ్రవాదుల కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ‘లష్కరే’కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News