: ప్రధానిని జగన్ కలవడంపై రాద్ధాంతం ఎందుకు?: బొత్స సత్యనారాయణ
ప్రధాని నరేంద్ర మోదీని తమ పార్టీ అధినేత జగన్ కలవడంపై టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానిని జగన్ కలిస్తే టీడీపీ నేతలకు అంత భయమెందుకని ప్రశ్నించారు. మోదీని జగన్ కలవడంతో సీఎం చంద్రబాబు అభద్రతా భావానికి గురవుతున్నారని, అసలు, ఒక ప్రతిపక్షనేత ప్రధానిని కలిస్తే తప్పేమిటన్నారు. వారి భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయో వైఎస్ జగన్ మీడియాకు తెలిపారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన పలు విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబులా తాము యూ టర్న్ తీసుకోమన్నారు.