: చేతన్... ఏమిటీ బూతు భాష?: రచయితపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం


ప్రముఖ రచయిత చేతన్ భగత్ వాడిన భాషపై గుజరాత్ హైకోర్టు మండి పడింది. చేతన్ రాసిన ‘త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ పుస్తకంలో ఒక పేరాను చదివిన ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య 'ఇది అశ్లీల భాషకాక మరేమిటని' ప్రశ్నించారు. చేతన్ రాసిన ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్ లో 'కైపోచి' సినిమా ఇటీవలే తెరముందుకు వచ్చి బాగా ఆదరణ పొందింది.

ఇందులో 2002 గుజరాత్ అల్లర్లకు హిందువులను బాధ్యులుగా చూపించారని, చేతన్ పుస్తకం ఆధారంగా తీసిన కైపోచి సినిమాను నిషేధించాలని, సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై గుజరాత్ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చేతన్ 'త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్' పుస్తకంలో పేరా చదివిన న్యాయమూర్తి "భాష హుందాగా లేదు. ప్రముఖ రచయిత వాడే భాష ఇదేనా? ఇది బూతు భాషలా ఉంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News