: వచ్చే రెండుమూడ్రోజుల్లో విపరీతంగా ఎండలు!
రాబోయే రెండు మూడ్రోజుల్లో ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు. అలాగే, మరోవైపు దక్షిణ అండమాన్ ద్వారా ఆగ్నేయ బంగాళాఖాతంలోకి రుతుపనవాలు ప్రవేశించనున్నాయని, దీని ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఎండలు విపరీతంగా పెరిగే అవకాశముందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.