: 'మోదీ ఓ క్రిమినల్ ను పక్కన కూర్చోబెట్టుకుంటారా?... బీజేపీ నేతలే ఆలోచించుకోవాలి' అన్న అయ్యన్నపాత్రుడు


ప్రధాని నరేంద్ర మోదీ, దేశాభివృద్ధి కోసం గతంలో ఏ ప్రధానీ కష్టపడనంతగా శ్రమిస్తున్నారని చెబుతూనే, వైఎస్ జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి కలవడాన్ని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. ఈ ఉదయం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానానికి వచ్చి మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓ మహా మేధావి అయిన మోదీ, ఓ నేరగాడిని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పుడు సంకేతాలను ఇస్తోందని అన్నారు. మంత్రి మాణిక్యాలరావు సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని, వీటిపై బీజేపీ నేతలే ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీజేపీతో తాము మరో ఐదేళ్లు కలసి నడవాలని భావిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News