: తానా నూతన అధ్యక్షుడిగా తాళ్లూరి జయశంకర్
తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) నూతన అధ్యక్షుడిగా తాళ్లూరి జయశంకర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు తానా ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో తానా ఫౌండేషన్ కు అధ్యక్షుడిగా కూడా సేవలందించిన జయశంకర్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు తెలిపింది. జయశంకర్ నేతృత్వంలో తానా మరింతగా బలపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఆయనకు పలువురు ప్రవాసాంధ్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ నెలలో తానా సభలు జరగనున్న సంగతి తెలిసిందే.