: పవన్ కల్యాణ్ మాట నిలుపుకోవాలని కోరుతూ పాలాభిషేకం!


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గతంలో తానిచ్చిన హామీపై నిలబడి తమను ఆదుకోవాలని కోరుతూ అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆయన ప్లెక్సీలకు పూజలు చేశారు. గత సంవత్సరం ఉండవల్లికి వచ్చిన ఆయన, ఈ ప్రాంతంలో భూ సేకరణకు తాను వ్యతిరేకినని, ప్రభుత్వం నోటీసు ఇస్తే రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తానని చేసిన హెచ్చరికలను గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రభుత్వం భూ సేకరణ నోటీసులు ఇచ్చినందున దాన్ని వెనక్కు తీసుకునేలా పవన్ ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. ఆయన మాట నిలుపుకోవాలంటూ, ప్లెక్సీలకు పాలాభిషేకం చేసిన రైతులు, పవన్ చిత్రపటం ముందు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

  • Loading...

More Telugu News