: రాకెట్ కు ట్రంప్ పేరు... ఆనందపడ్డ అమెరికా అధ్యక్షుడు


ఓ స్కూలు విద్యార్థులు తయారు చేసిన రాకెట్ కు తన పేరును పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నార్త్ కరోలినాలోని విక్టోరియా క్రిస్టియన్ సెంటర్ పాఠశాల స్టూడెంట్స్ తాము రూపొందించిన రాకెట్ కు ట్రంప్ అని పేరు పెట్టారు. ఇక ఈ పేరెందుకు పెట్టారన్న ప్రశ్నకు 'ఇది అన్నింటిపైనా విజయం సాధిస్తుంది' అని విద్యార్థులు సమాధానం ఇవ్వగా, విషయం అధ్యక్షుడి వరకూ వెళ్లింది.

దీనిపై ట్రంప్ స్పందించి, విద్యార్థుల కృషికి అభినందనలు తెలిపారు. అమెరికా కార్మికులు ఇతర దేశాలకు అమ్ముడు పోవడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన ఆయన, ఉపాధి అవకాశాలను దెబ్బతీసే నిబంధనలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇంధన రంగ అభివృద్ధిపై మరింత కృషిని చేయనున్నామని, నిలిచిన అభివృద్ధిని తిరిగి గాడిలో పెడతానని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News