: కశ్మీర్ యువత పథం మారుతోంది.. 700 పోలీసు ఉద్యోగాలకు 67వేల మంది దరఖాస్తు


అవును!.. కశ్మీర్ యువతలో మార్పు వస్తోంది. నిన్నమొన్నటి వరకు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్విన వారే నేడు పోలీసు ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్‌ను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అపహరించి హత్యచేసిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాల్లో చేరి దేశానికి సేవచేయాలనుకునే వారికి హెచ్చరికగా ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జమ్ముకశ్మీర్‌లోని 698 ఎస్సై పోస్టులకు ఏకంగా 67,218 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

శనివారం శ్రీనగర్‌లోని భక్షి స్టేడియంలో 2 వేల మంది యువతీయువకులు ఫిజికల్ టెస్ట్‌కోసం హాజరయ్యారు. పోలీస్ ఫోర్స్‌లో చేరవద్దని వివిధ ఉగ్ర సంస్థలు చేస్తున్న హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. దరఖాస్తు చేసుకున్న 67,218 మందిలో 35,722 మంది కశ్మీరీలు కాగా, 31,496 మంది జమ్ము ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకున్నారు. 6 వేల మంది యువతులు కూడా దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News