: జస్టిస్ కర్ణన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న పోలీసులు.. కానరాని న్యాయమూర్తి!


వివాదాస్పద ఆదేశాలు, సుప్రీం న్యాయమూర్తులపై ఆరోపణలతో సంచలనం సృష్టించిన జస్టిస్ కర్ణన్ కోసం పశ్చిమబెంగాల్ పోలీసులు కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ వెతుకుతున్నా ఫలితం లేకుండాపోయింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఆయన చెన్నైలో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు నిరాశే ఎదురైంది. నగరంలోని ఓ అతిథి గృహంలో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన కనిపించకపోవడంతో అక్కడే పడిగాపులు కాశారు.

అదే సమయంలో కర్ణన్ శ్రీకాళహస్తిలో ఉన్నారని ఒకరు, నెల్లూరులో ఉన్నారని మరొకరు చెప్పడంతో అక్కడికీ వెళ్లి గాలించారు. అయినా ఫలితం శూన్యం. ఆయన కోసం ఓవైపు పశ్చిమబెంగాల్ పోలీసులు, మరోవైపు ఏపీ, చెన్నై పోలీసులు కూడా గాలింపు ముమ్మరం చేశారు. కాగా, తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 11న కర్ణన్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఎక్కడికీ పారిపోలేదని, చెన్నైలోనే ఉన్నారని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.



 

 

  • Loading...

More Telugu News