: ప్లాన్లను రివ్యూ చేస్తున్న ఎయిర్‌టెల్.. ఇకపై నెలకు 10 జీబీ ఉచిత డేటా!
టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ గతంలో ప్రకటించిన ప్లాన్లను సవరించే పనిలో పడింది. ‘మై హోం’ పథకంలో మరో ఆఫర్‌ను చేర్చింది. ఇప్పటివరకు దీని ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా ఇస్తున్న 5 జీబీ డేటాను రెట్టింపు చేసి 10 జీబీకి పెంచింది. ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌తో తీసుకున్న పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్ సేవలపై ఇక నుంచి నెల 10 జీబీల ఉచిత డేటాను అందిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. మై ఎయిర్‌టెల్ యాప్‌లోని మైహోం ద్వారా మాత్రమే ప్రస్తుతం ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్ బ్రాండ్‌బ్యాండ్, పోస్ట్‌పెయిడ్, డిజిటల్ టీవీ సర్వీస్ కలిగినవారు దీనిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.