: స్వయంగా ప్రధాని వచ్చి... తలుపుతడితే స్పందించని లండన్ వాసి!


స్వయంగా ప్రధాన మంత్రి ఇంటి ముందుకు వచ్చి తలుపుతడితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, లండన్ లో ఓ వ్యక్తి మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వచ్చింది ప్రధాని థెరిసా మే అని కాలింగ్ బెల్ వీడియోలో చూసి కూడా పట్టించుకోలేదు సరికదా... టీవీలో తాను చూస్తున్న కార్యక్రమంలో లీనమైపోయాడు. ఈ ఘటన సౌతాంప్టన్ లో జరిగింది.

తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న థెరిసా మే, డేవిడ్ బ్రియాన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. లోపల ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డేవిడ్, ప్రధాని వచ్చారు అన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక తన బిజీ షెడ్యూల్ లో భాగంగా ఆమె మరో ఇంటికి వెళ్లిపోతుండగా, ఆ సమయంలో కిటికీ వద్దకు వచ్చి చూశాడు డేవిడ్. ఈ తతంగానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News