: అక‌స్మాత్తుగా మోదీని జ‌గ‌న్ ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చింది.. అందుకేనా?: చ‌ంద్ర‌బాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక‌ హోదా కోసం రాజీనామాలు చేస్తామన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎద్దేవా చేశారు. అకస్మాత్తుగా వైసీపీ అధినేత‌ జగన్ ప్రధాని మోదీని ఎందుకు కలిశారో చెప్పాల‌ని తాను సూటిగా ప్ర‌శ్నిస్తున్నాన‌ని అన్నారు. 'హోదా విషయంలో టీడీపీ తప్పు చేసినట్లు మాట్లాడిన జ‌గ‌న్, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే వైసీపీ నేత‌లు రాజీనామా చేస్తార‌ని ప్ర‌ధానితో చెప్పారా? అలా చెప్పడానికే ఆయనను కలిశారా?' అని చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి అక్ర‌మార్కుల‌ను స్ఫూర్తిగా తీసుకుని విశాఖలో హవాలా తరహా నేరాలు జరుగుతున్నాయని చంద్ర‌బాబు ఆరోపించారు.

త‌న ఆస్తుల‌కు లెక్క‌లు చెప్పలేని జ‌గ‌న్ ఇత‌రుల‌పై మాత్రం ఆరోప‌ణ‌లు చేస్తున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ఎందుకు తీసుకున్న‌ట్లు? ఎందుకు క‌లిసిన‌ట్లు? అని ప్ర‌శ్నించారు. పెట్టుబ‌డులు తీసుకురావాల‌ని తాను అమెరికాకు వెళితే, వైసీపీ అమెరికాలో కూడా దారుణానికి వ‌డి గ‌ట్టిందని, అమెరికాలోనూ తెలుగు జాతి ప్ర‌తిష్ఠ దిగ‌జార్చే ప్ర‌య‌త్నం చేసేలా ప్ర‌వ‌ర్తించింద‌ని ఆరోపించారు. ఇటువంటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుల వ‌ల్ల రాష్ట్ర భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందని ఆయ‌న ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News