: చైతూ చెప్పింది మిగతా అమ్మాయిల గురించి!: హీరోయిన్ సమంత


టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ థ్రియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ రోజు ఆ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో నాగ‌చైత‌న్య‌ ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ పేల్చిన డైలాగ్ అద‌ర‌గొట్టేసింది. పచ్చటి పొలాల మ‌ధ్య‌ సందడిగా సాగే సన్నివేశాలు అందులో క‌న‌ప‌డుతున్నాయి.

అయితే, నాగ‌చైత‌న్య ప్రియురాలు న‌టి స‌మంత ఈ రోజు  ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే ఈ సినిమా డైలాగ్‌పై స‌ర‌దాగా ఓ ట్వీట్ కి రిప్లై ఇచ్చి త‌న అభిమానుల‌ను అల‌రించింది. సమంతకు ఓ అభిమాని ట్వీట్ చేస్తూ 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.. అని చైతు అంటున్నాడు, సమంతా' అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌పై స్పందించిన స‌మంత.. 'హా.. హా.. ఆ డైలాగ్ మిగ‌తా అమ్మాయిల గురించి' అంటూ చమత్కరించింది.  




  • Loading...

More Telugu News