: వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో నిన్న సీబీఐ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తవ్వినకొద్దీ ఆస్తులు బయటపడుతుండడంతో ఆయనపై టీడీపీ అధిష్ఠానం వేటు వేసింది. ఈ రోజు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడిలో మీడియాతో మాట్లాడుతూ... వాకాటి నారాయణ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఆరోపణలు, సీబీఐ కేసుల దృష్ట్యా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. దేనికైనా ఓ పద్ధతి ఉండాలని, పార్టీలో ఎవ్వరు తప్పు చేసినా సస్పెండ్ చేస్తామని అన్నారు.