: జగన్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది: రఘువీరారెడ్డి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదాపై పోరాటం చేసిన జగన్ ... ఇప్పుడు బీజేపీతో చేయి కలిపి ఆ ముసుగును తొలగించారని విమర్శించారు. హోదా కోసం జగన్ పెద్ద పోరాటమే చేస్తున్నాడని ఇంతకాలం అందరూ భావించారని... కానీ అతని నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందని అన్నారు. మోదీ పక్కన చేరి, హోదాను తాకట్టు పెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా... రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని మోదీకి జగన్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామంటూ బీజేపీకి టీడీపీ, వైసీపీలు షరతు విధించాలని అన్నారు. రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం బీజేపీతో పోరాటం చేసిన సంగతిని గుర్తు చేశారు.