: ఇంటర్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన యువకుడు
రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఘన్‌పూర్‌లో ఓ యువకుడు ఓ ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం నుంచి తమ కూతురు కనిపించడం లేదని, తమ ప్రాంతంలోనే ఉండే పొట్ట రాజు అనే యువకుడు తమ కూతురిని అపహరించాడని ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆ బాలిక తల్లిదండ్రుల నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.