: చీర కట్టుకుంటే మహారాణిలా ఉన్నట్లు అనిపిస్తుంది: హీరోయిన్ శ్రియా


తాను చీరకట్టుకుంటే మహారాణిలా ఉన్నట్లు అనిపిస్తుందని సినీ న‌టి శ్రియ చెప్పింది. ఈ రోజు ఆమె చేతుల మీదుగా సికింద్రాబాద్‌లో ఓ వ‌స్త్ర దుకాణం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రియా మాట్లాడుతూ.. మ‌న దేశ‌ సంస్కృతి, సంప్రదాయాలకు చీరకట్టు అందాన్నిస్తుందని వ్యాఖ్యానించింది.

 తాను ఈ రోజు మహిళలకు సంబంధించిన వస్తువులు అమ్మే షోరూంను ప్రారంభించాన‌ని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. చీరలు తయారు చేసే కార్మికులకు ప్రోత్సాహకాలు ఉండాల‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. ప్రభుత్వం వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే చేనేత పరిశ్రమ నిల‌దొక్కుకుంటుంద‌ని ఆమె తెలిపింది. తాను ‘బాహుబలి-2’ సినిమాను చూశాన‌ని చెప్పిన ఆమె, ఆ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేయ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

  • Loading...

More Telugu News