: హడలెత్తిస్తున్న రమ్యకృష్ణ.. మీరూ చూడండి!
బ్లాక్ బస్టర్ మూవీ 'బాహుబలి'లో శివగామి పాత్రను పోషించిన రమ్యకృష్ణకు సినీ అభిమానులందరి నుంచి ప్రశంసలు లభించాయి. గతంలో కూడా అనేక పవర్ ఫుల్ పాత్రల్లో నటించి, మెప్పించింది రమ్యకృష్ణ. తాజాగా మాతంగి అనే మలయాళ సినిమాను రమ్యకృష్ణ చేస్తోంది. కన్నన్ థమరక్కులమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో రమ్యకృష్ణ గెటప్ ను చూసిన వారు షాకయ్యారు. పూర్తి డీగ్లామరస్ గా, ఎంతో కోపంతో రమ్యకృష్ణ కనిపిస్తోంది. మరోవైపు, ఈ సినిమా థ్రిల్లర్ మూవీలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.