: ఈవ్ టీజింగ్ చేసిన వారిని చెట్టుకు కట్టేసి, కుమ్మేశారు
ఈవ్ టీజింగ్ కు పాల్పడిన ఇద్దరు పోకిరీలకు మహిళలు చుక్కలు చూపించారు. చెట్టుకు కట్టేసి, చెప్పులతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మావ్ అనే టౌన్ లో ఇద్దరు పోకిరీలు ప్రతి రోజూ రోడ్డు మీద వెళుతున్న అమ్మాయిలను వేధిస్తూ, హింసించేవారు. దీంతో, అమ్మాయిల జోలికి వెళ్తే దేహశుద్ధి తప్పదంటూ ఇప్పటికే వారిని హెచ్చరించారు. నిన్న కూడా ఓ అమ్మాయిని వేధించారు. దీంతో, ఆ అమ్మాయి ఏడుస్తూ తన ఆవేదనను తోటి వారితో చెప్పుకుంది. దీంతో, ఆ ఇద్దరినీ పట్టుకొచ్చిన జనం వారిని చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత అక్కడున్న మహిళలంతా కలసి వారిని చెప్పులతో కొట్టి శిక్షించారు.