: మహిళను కిడ్నాప్ చేసి.. అతి దారుణానికి పాల్పడ్డ యువకులు!
హర్యానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని రోహ్‌తక్ ప్రాంతంలో ఓ మహిళ విధులకు వెళ్తుండగా పలువురు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమె శరీర భాగాలను ముక్కలుముక్కలుగా నరికేశారు. పోలీసులకు ఎటువంటి సాక్ష్యాలు దొరకూడదనే ఉద్దేశంతో ఆ మహిళ ముఖంపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. ముక్కలుగా పడిఉన్న ఆ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ మహిళపై మొత్తం ఏడుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఎట్టకేలకు దారుణానికి గురైన ఆ మహిళ గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.