: అమిత్ షా టార్గెట్ అసదుద్దీన్ ఒవైసీ?


దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మరే ఇతర రాష్ట్రంలో బీజేపీకి ఏ మాత్రం పట్టు లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణపై ఈ కమల దళాధిపతి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టాలని యత్నిస్తున్నారు.

 ఈ నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో పాగా వేయడంపై ఆయన దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో ఒవైసీపై బీజేపీ అభ్యర్థి గెలుపొందేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 32వేల పోలింగ్ కేంద్రాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. తద్వారా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు హైదరాబాదులో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News