: అభిమాని అత్యుత్సాహం... హీరో విజయ్ మెడకు చుట్టుకుంది!


సినీ హీరోలపై అభిమానం అంటే తమిళులదేనని సినీ ప్రేమికులు చెబుతుంటారు. వారు సినీ హీరోలను అభిమానించడం, ఆరాధించడం, అనుకరించడం జీవితంలో భాగం చేసుకున్నారని చెబుతుంటారు. దానికి తగ్గట్టే అక్కడ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే రాజకీయాల్లో రాణించారు. అలాంటి నేపథ్యంలో, ఒక వ్యక్తి తన అభిమాన హీరోను అక్కడ చిక్కుల్లో పడేశాడు.

ఇతర హీరోల కంటే తమ హీరోను గొప్పగా చూపించాలన్న ప్రయత్నంలో ఫోటో షాప్ ద్వారా హీరో విజయ్ త్రిశూలం పట్టుకుని ఉన్న ఫోటోను పోస్టు చేశాడు. దీనిపై హిందూ మక్కల్ మన్నాని పార్టీ అభ్యంతరం తెలిపింది. త్రిశూలం తమకు పవిత్రమైనదని, దానిని షూ ధరించిన వ్యక్తి పట్టుకోరని, ఆ పోస్టర్ లో విజయ్ షూ ధరించి త్రిశూలం పట్టుకున్నారని, దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. దర్యాప్తు అనంతరం విజయ్ పై కేసు నమోదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News