: తల్లి బతికుండగానే గుడి కట్టించిన లారెన్స్.. రేపే ప్రారంభోత్సవం


ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ తన తల్లి కన్మణికి గుడి కట్టించాడు. ఆమె బతికి ఉండగానే ఈ గుడిని కట్టించడం గమనార్హం. అంబత్తూర్ లో కొన్నేళ్ల క్రితం లారెన్స్ రాఘవేంద్ర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే తన తల్లికి కూడా గుడిని కట్టించారు. ఈ గుడిని రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ చేతుల మీదుగా గుడిని ప్రారంభిస్తున్నట్టు లారెన్స్ తెలిపాడు. కెరీర్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లారెన్స్ ను సూపర్ సుబ్బరాయన్ ఆదుకున్నాడు. గుడి ప్రారంభోత్సవం సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీరలను అందజేయనున్నారు. దీనికితోడు ఆరుగురు మహిళా రైతులకు సహాయం చేయనున్నారు.

  • Loading...

More Telugu News