: ఒకవేళ డేటింగ్ చేస్తే.. అతనితోనే చేస్తా: రకుల్ ప్రీత్ సింగ్


భారతీయ వివాహ వ్యవస్థ మీద తనకు ఎంతో నమ్మకం ఉందని టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే ఆనందం ఎక్కువగా ఉందని తెలిపింది. ఇప్పటికిప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని... పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పింది. తనకు నచ్చిన వాడు ఇంకా కంటపడలేదని... సరైనవాడి కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.

తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని... ఒక వేళ డేటింగ్ చేయాల్సి వస్తే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో చేస్తానని బోల్డ్ గా చెప్పింది. తాను ప్రారంభించిన జిమ్ వ్యాపారం బాగానే ఉందని... రానున్న రోజుల్లో మరో రెండు బ్రాంచ్ లు ప్రారంభిస్తామని తెలిపింది. తన కుటుంబసభ్యులే ఆ వ్యాపారాన్ని చూసుకుంటున్నారని చెప్పింది.

  • Loading...

More Telugu News