: సచిన్ కుమారుడికి ఏమైంది? సోషల్ మీడియాలో ఆందోళన


టీమిండియా దిగ్గజ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ కు ఏమైందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఈ నెల 10న ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. బీబర్ ను చూసిన వారంతా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బీబర్ ఫోటోతో అర్జున్ ఫోటోను పెట్టి వ్యాఖ్యలతో హోరెత్తించారు. ఈ క్రమంలో బీబర్ షోకు అర్జున్ టెండూల్కర్ కూడా హాజరయ్యాడు.

అయితే అర్జున్ చేతి కర్రల సాయంతో బీబర్ షోకు హాజరయ్యాడు. దీంతో సచిన్ అభిమానులు ఆందోళన చెందారు. ఇండియన్ బీబర్ కు ఏమైంది? అంటూ అతని పట్ల సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీబర్ షో అట్టర్ ఫ్లాప్ కావడంతో... స్టేజ్ మీద ఉన్నది జస్టిన్ బీబర్ కాదని, ఇండియన్ జస్టిన్ బీబర్ (అర్జున్ టెండూల్కర్) అని, అందుకే పాటలు పాడడం లేదని, కేవలం పెదాలు మాత్రమే కదిపాడని జోకులు వేశారు. దీనిపై పలువురు నెటిజన్లు అర్జున్ టెండూల్కర్ బీబర్ కంటే బాగా పాడి... పెదాలు సింక్ అయ్యేలా ప్రయత్నించేవాడని మద్దతు తెలిపారు. క్రీడాభిమానులు మాత్రం అర్జున్ టెండూల్కర్ కు ఏమైంది? అంటూ ఆరాలు తీస్తున్నారు.

  • Loading...

More Telugu News