: మళ్లీ నటించనున్న విజయశాంతి.. ఫిజిక్ కోసం జిమ్ లో కసరత్తులు


చాలా గ్యాప్ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు లేడీ బాస్ విజయశాంతి కూడా చిరు అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. మళ్లీ నటించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాతే చిరంజీవి, విజయశాంతిలు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన విజయశాంతి ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం దర్శకులు, నిర్మాతల వద్ద కథలు వినే పనిలో ఆమె బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో ఆమె సినిమా ప్రారంభమవుతుందని చెబుతున్నారు. తన రీఎంట్రీ కోసం ఫిజిక్ ను మెరుగుపరుచుకోవడానికి జిమ్ లో ఆమె కసరత్తులు చేస్తున్నారట.

  • Loading...

More Telugu News