: పళనిస్వామితో తమిళ సినీ ప్రముఖుల భేటీ


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కోలీవుడ్ ప్రముఖులు కలిశారు. సుమారు గంటసేపు ఆయనతో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన పలు సమస్యలు, పైరసీ తదితర అంశాలపై చర్చించారు. షూటింగ్ సమయంలో పలు సమస్యలను నిర్మాతలు ఎదుర్కొంటున్నారని... విడుదల సమయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రితో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్ చెప్పారు.

జూన్ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ వల్ల కూడా సినీ రంగానికి సమస్యలు ఎదురవుతాయని తెలిపాడు. సినిమాలకు కొన్నేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కూడా చాలా ఏళ్లుగా ఆగిపోయిందని చెప్పాడు. ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. సమావేశం అనంతరం మీడియాతో విశాల్ మాట్లాడుతూ తమ డిమాండ్ల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

సీఎంతో భేటీ అయినవారిలో విశాల్ తో పాటు, ప్రకాశ్ రాజ్, దర్శకుడు గౌతమ్ మీనన్, నిర్మాతల మండలి కోశాధికారి కదిరేశన్, థియేటర్ల సంఘం నిర్వాహకుడు అభిరామి రామనాథన్ లు ఉన్నారు.

  • Loading...

More Telugu News