: పిల్లల జీవితాలతో ఆడుకుంటారా?: ట్రంప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మిషెల్ ఒబామా!


డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా నిప్పులు చెరిగారు. పాఠశాల భోజన పోషకాహార అవసరాలను తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మన పిల్లలకు మంచి భోజనం వద్దని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. పార్టనర్ షిప్ ఫర్ హెల్దియర్ అమెరికా వార్షిక సదస్సులో ఆమె ప్రసంగిస్తూ ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

అమెరికా అగ్రికల్చర్ సెక్రటరీ జారీ చేసిన ప్రకటనలో తృణధాన్యాలు 100 శాతం స్టాండర్డ్స్ కలిగి ఉండాలనే నిబంధనపై సడలింపునిచ్చారు. ఈ నేపథ్యంలో, విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తక్కువ సోడియం ఉండాలనే కఠినతరమైన నిబంధనను పాఠశాలలు పట్టించుకోకపోయినా ఎలాంటి చర్యలు ఉండవు. దీంతో, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యత కోల్పోయే అవకాశం ఉందని మిషెల్లీ మండిపడ్డారు. దీనిపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. 

  • Loading...

More Telugu News