: అసభ్యకర చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి


తన ఫొటోను మరో చిత్రానికి అతికించి అసభ్యంగా తయారు చేసి ఇంటర్నెట్ లో పెట్టడంపై సినీ నటి శ్రుతి హరిహరన్ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో పాటు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆమె... సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు ఇచ్చింది. తన ఫొటోను మార్పింగ్ చేసి, తన గౌరవానికి భంగం కలిగించేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరింది. దుండగుల చర్యతో తాను మానసిక వేదనను అనుభవిస్తున్నానని పేర్కొంది. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల సినిమాల్లో ఈమె నటించింది. 

  • Loading...

More Telugu News