: ఏపీ పోలీస్ నెట్ వర్క్ ను హ్యాక్ చేసిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ నెట్ వర్క్ హ్యాకింగ్ కు గురైంది. చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను దుండగులు హ్యాక్ చేశారు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. కంప్యూటర్లు ఓపెన్ కాకపోవడంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగింది. దీనికి సంబంధించి తిరుపతి వెస్ట్ పీఎస్ లో సైబర్ క్రైమ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.