: అమరవీరుల కుటుంబాలకు బాలీవుడ్ హీరో చేయూత.. ఉచితంగా 25 ఫ్లాట్లు ఇవ్వనున్న వివేక్ ఒబెరాయ్!


అమరవీరుల కుటుంబాలకు చేయూత అందించేందుకు బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ ముందుకొచ్చాడు. థానేలోని సీఆర్‌పీఎఫ్ అమర సైనికుల కుటుంబాలకు 25 ఫ్లాట్లు దానం చేయనున్నట్టు ప్రకటించిన వివేక్ ఈమేరకు సీఆర్‌పీఎఫ్‌కు లేఖ రాశాడు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ అమరుల కుటుంబాలకు తన కంపెనీ కరమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ తరపున 25 ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని అనుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎంపిక చేసిన అమరుల కుటుంబాల పేర్లతో కరమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఓ జాబితాను విడుదల చేసింది. కాగా, ఇప్పటికే నాలుగు ఫ్లాట్లు అందించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News