: ఆ కోపంలో డ్రెస్సింగ్ రూంలో లాకర్ కు పంచ్ ఇచ్చాను... అదే నాలో ఇంత మార్పు తెచ్చింది!: బెన్ స్టోక్స్


ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన ఇంగ్లండ్ ఆల్‌ రౌండర్ బెన్ స్టోక్స్ తన జీవితంలో చోటుచేసుకున్న అతి ముఖ్యమైన ఘటన గురించి గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం తానిలా ఆడడానికి, ఇంత నిబ్బరంగా ఉండడానికి కారణం ఆ ఘటనేనని తెలిపాడు. 2014 టీ 20 ప్రపంచ కప్‌ జట్టులో మణికట్టు గాయం వల్ల స్టోక్స్‌ స్థానం కోల్పోయాడు.

ఆ గాయం ఆటలో గాయపడడం వల్ల జరగలేదని, డ్రెస్సింగ్ రూంలో తీవ్ర భావోద్వేగానికి గురైన తాను ఇనుప బీరువా లాకర్ పై పిడిగుద్దు విసిరడం వల్ల కలిగిందని చెప్పాడు. మూర్ఖత్వంతో చేసిన ఆ పని తనకు చాలా పాఠాలు నేర్పిందని తెలిపాడు. 'ఏదైనా విషయంపై మనకు ఉన్న పిచ్చి ప్రేమ...మన మెదడును తప్పుదోవపట్టిస్తుంది...ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని, మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి? అన్న ఆలోచనతో సరైన మార్గాన్ని ఎంచుకుంటే విజయం సిద్ధిస్తుంది' అని తెలిపాడు. ఆ ఘటన నుంచి తాను మారానని తెలిపాడు. ఇప్పుడు భావోద్వేగాలకు గురైనా అలా లాకర్ ను పంచ్ చేయనని, విఫలమైన దానిని సాధించే పనిపై మనసు లగ్నం చేస్తానని స్టోక్స్ తెలిపాడు.

  • Loading...

More Telugu News