: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి, 56 అంగుళాల జాకెట్ పంపిన మాజీ జవాను భార్య!


1991 నుంచి 2007 వరకు ఇండియన్ ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు ధరమ్ వీర్ భార్య సుమన్ సింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ కలకలం రేపుతోంది. పాక్ ఆగడాలకు ఆయన అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆరోపిస్తూ ఆమె లేఖలో రాశారు.

‘ధైర్యానికి ప్రతీక అయిన మీ 56 అంగుళాల ఛాతి ఏమైంది? మన బలగాలపై పాకిస్థాన్‌ జరుపుతున్న దాడులను నివారించలేక పోతున్నారెందుకు? గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే.. భారతవైపు పాక్‌ కన్నెత్తిచూసే సాహసం కూడా చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కదా? ... ఇప్పుడేం జరుగుతోంది? పరిస్థితులు గతంలోకన్నా దారుణంగా మారాయి. ఆర్మీకి పూర్తి స్వేఛ్చనివ్వండి. వారే పాక్ ఆగడాల ఆటకట్టిస్తారు’ అంటూ పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు ఆమె 56 అంగుళాల జాకెట్‌ (బ్లౌజు) ను కూడా ఫతేహాబాద్‌ లోని ‘జిల్లా సైనిక్‌ బోర్డు’ అధికారులకు అందజేశారు.

  • Loading...

More Telugu News