: దేశాన్ని ప్రేమించే వారు బీజేపీకే ఓటేస్తారు.. కలకలం రేపిన మంత్రి వ్యాఖ్యలు


మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విశ్వాస్ సారంగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశాన్ని ప్రేమించేవారు బీజేపీకే ఓటు వేస్తారన్న ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ‘‘ఇందులో మరో ఆలోచనే లేదు. దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారి మద్దతు బీజేపీకే ఉంటుంది. వారి ఓటు కూడా బీజేపీకే. నేను ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా’’ అని సారంగ్ వ్యాఖ్యానించారు.  

గత 70 ఏళ్లుగా దేశానికి కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. ఇది కాంగ్రెస్ దేశానికి చేసిన మోసమేనని విమర్శించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాంగ్రెస్ దారుణంగా దెబ్బతీసిందని దుయ్యబట్టారు. పాకిస్థాన్‌పై బీజేపీ ప్రభుత్వం సర్జికల్ దాడులు చేస్తే కాంగ్రెస్ దానిని ప్రశ్నించిందని పేర్కొన్న మంత్రి, ఇదేనా దేశభక్తి? అని ప్రశ్నించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రతిపక్షాలు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News