: 'అమ్మ ప్రేమ' మనుషుల్లోనే కాదు... జంతువుల్లో కూడా ఉంటుంది... సాక్ష్యం ఇదిగో!


వెయ్యి మాటల్లో వ్యక్తం చేయలేని భావాన్ని ఒక్క ఫోటోతో చెప్పవచ్చన్న సంఘటన చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అయ్ లాన్ కుర్దీ మృతదేహాన్ని సముద్రపు ఒడ్డున చూసిన సందర్భమైనా...వియత్నాం యుద్ధ బీభత్సాన్ని ప్రపంచం కళ్లముందుంచిన సందర్భమైనా... అవి ఫోటోలకే సాధ్యం. సృష్టిలో అమ్మ ప్రేమను మించినదేదీ లేదు. అయితే, ఈ అమ్మ ప్రేమ కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువుల్లో కూడా ఉంటుందని జబల్‌ పూర్‌ కి చెందిన అవినాశ్‌ లోథి అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటో నిరూపిస్తోంది.

సరదాగా కోతులన్నీ ఆడుకుంటుండగా అందులో ఓ పిల్ల కోతి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుంది. దానిని యథాస్థితికి తీసుకొచ్చేందుకు తల్లి కోతి చేసిన ప్రయత్నం విఫలమవడంతో, ఆ సమయంలో పిల్లకోతిని చేత్తో కాస్త పైకి లేపి తల్లి కోతి బేలగా ఏడుస్తూ వున్న దృశ్యాన్ని అవినాశ్‌ తన కెమెరాలో బంధించాడు. అయితే, విచిత్రనగా ఆ కోతి పిల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాసేపటి తరువాత అది మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. అయితే తన పిల్లకి ఏమైందో అని తల్లికోతి పడిన ఆవేదన ఎలాంటి వారినైనా ఆందోళనకు గురిచేస్తుంది. ఆ ఫోటో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News