: 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' ఖాతాలో మరో రికార్డు
'బాహుబలి-2:ద కన్ క్లూజన్' దెబ్బకి రికార్డులన్నీ తెల్లబోయాయి. ఇంతవరకు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కిన 'దంగల్' సాధించిన వసూళ్లను 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా అధిగమించింది. 'దంగల్' హిందీలో 387.39 కోట్ల రూపాయలు వసూలు చేసి, దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కగా, దానిని 392 కోట్ల రూపాయల వసూళ్లతో 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' సినిమా అధిగమించింది. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' నిలిచింది. ఇప్పటికే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.